భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారంతో కూడిన ఉదయపు అల్పాహారం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలిముద్ద కార్యక్రమం నెల్లికుదురు మండలంలోని నాలుగు గ్రామాల్లో సోమవారం ప్రారంభమైంది. మండల కేంద్రం నెల్లికుదురుతో పాటు వస్రాం తండా, మునిగలవీడు, మదనతుర్తి గ్రామాల్లో సెక్టార్ సూపర్వైజర్ సరిత ఆదేశాల మేరకు అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో ఆయా గ్రామాల సర్పంచులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

నెల్లికుదురులో..

నెల్లికుదురు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో స్థానిక సర్పంచి పులి వెంకన్న తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ…