భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. అదే విధంగా గ్రామాల్లో జల సంరక్షణ కార్యక్రమాలను వేగవంతం చేసి, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు.
సోమవారం కౌడిపల్లి మండల కేంద్రంలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం దరఖాస్తుల నమోదు ప్రక్రియతో పాటు జలసిరి పనులను…






