భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: విద్యాసంస్థల పరిసరాల్లో పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై భైంసా రూరల్ పోలీసులు చర్యలు చేపట్టారు. విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులను విక్రయించడం చట్టరీత్యా నేరమని భైంసా రూరల్ ఎస్సై సుప్రియ స్పష్టం చేశారు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాన్ షాపుల యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.

COTPA చట్టం ప్రకారం విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తులను విక్రయించడం, విక్రయానికి ఉంచడం నిషేధం. ఈ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని పోలీసులు…