భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: వృద్ధులు, దివ్యాంగులకు అండగా నిలిచి వారి రోజువారీ పనులను మరింత సులభతరం చేసేందుకు హుస్నాబాద్‌లో ఉచిత సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో అలింకో సంస్థ ఆధ్వర్యంలో నవంబర్ 24న ఈ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు హుస్నాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెన్న రాజు తెలిపారు.

ఈ సందర్భంగా వెన్న రాజు మాట్లాడుతూ.. హుస్నాబాద్ నియోజకవర్గంలోని వృద్ధులు, దివ్యాంగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన మంత్రి పొన్నం ప్రభాకర్…