భారత్ సమాచార్, మెదక్ జిల్లా: గురునానక్ జయంతి వేడుకలను పురస్కరించుకుని రామాయంపేటలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డులో జాతీయ రహదారి 44 పక్కన ఉన్న గురునానక్ ఆలయంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు, స్థానిక నాయకులు తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కౌన్సిలర్ గజవాడ నాగరాజు గుప్తా హాజరై గురునానక్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..…






