భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నెల్లికుదురు, ఇనుగుర్తి శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్రమైన కార్తీక పౌర్ణమి సందర్భంగా మంగళవారం రెండు ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు చేరుకోవడంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. ఈ సందర్భంగా ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.
నెల్లికుదురు శివపార్వతీ ఆలయంలో ప్రత్యేక పూజలు
మండల కేంద్రం నెల్లికుదురులోని శ్రీ శివపార్వతి సహిత భక్త మార్కండేయ స్వామి ఆలయానికి…






