భారత్ సమాచార్, మెదక్ జిల్లా: ఎనిమిది నెలల క్రితం సంచలనం సృష్టించిన వలస కూలీ హత్య కేసు మిస్టరీని రామాయంపేట పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. చిన్నశంకరంపేట మండలం మిర్జాపల్లి వద్ద జరిగిన హత్యకు సంబంధించి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బరాస్ సర్దార్ అనే నిందితుడిని అరెస్టు చేశారు. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
గురువారం రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో DSP నరేందర్ గౌడ్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ…






