భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జాతీయ రహదారిపై పండ్ల బండిని ఏర్పాటు చేసి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించిన వ్యాపారికి న్యాయస్థానం పది రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. నర్సాపూర్ పట్టణంలో ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించేలా రహదారిని ఆక్రమించిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయగా, విచారణ అనంతరం కోర్టు ఈ తీర్పు వెలువరించింది.

నర్సాపూర్ పట్టణంలోని NH-765D జాతీయ రహదారిపై మెదక్ వైపు వెళ్లే మార్గంలో చైతన్యపురి కాలనీకి చెందిన శక్తి ఆకాష్ (30) పండ్ల బండిని ఏర్పాటు చేసి వ్యాపారం…