భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: యాసంగి సాగులో రైతులు పంటల ఎంపిక విషయంలో జాగ్రత్తగా ఉండాలని, నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకుని ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఇనుగుర్తి మండల వ్యవసాయ శాఖ అధికారి ఎస్.కె. యాస్మిన్ సూచించారు. మండలంలోని చిన్ననాగారం గ్రామ పంచాయతీ ఆవరణంలో శుక్రవారం ఆమె ఆధ్వర్యంలో యాసంగి సాగులో పంటల మార్పిడి, ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏవో యాస్మిన్ మాట్లాడుతూ.. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.…