భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: పోలీసులు విధుల్లో క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్, IPS సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శుక్రవారం కోహెడ పోలీస్ స్టేషన్‌ను ఆమె తనిఖీ చేశారు. స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు ఎస్ఐ అభిలాష్ ఆధ్వర్యంలో సిబ్బంది రిపోర్ట్ చేశారు. అనంతరం నిర్వహించిన పోలీస్ పరేడ్‌ను ఆమె పరిశీలించారు.

తనిఖీల్లో భాగంగా పోలీసు సిబ్బంది కిట్ ఆర్టికల్స్‌ను పరిశీలించడంతో పాటు, వివిధ కేసులకు సంబంధించిన వాహనాలను తనిఖీ…