భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, ఉద్యమకారుల త్యాగాలు, ప్రజా పోరాటాల చరిత్రను భావితరాలకు తెలియజేయడమే దీక్షా దివస్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. నవంబర్ 29న కరీంనగర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ బహిరంగ సభకు హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివెళ్లేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.

ఈ మేరకు శనివారం హుస్నాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంథని మాజీ ఎమ్మెల్యే,…