భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: పట్టుదల, కృషి, ప్రతిభతో ఉన్నత విద్యలో సత్తా చాటిన అక్కన్నపేట మండలం కేశవపూర్ గ్రామానికి చెందిన ఎర్రోజు కాలజ్ఞ కాకతీయ విశ్వవిద్యాలయం గోల్డ్ మెడల్ సాధించి గ్రామానికి గర్వకారణంగా నిలిచారు. ఎం.ఎస్సీ బయోటెక్నాలజీలో అత్యుత్తమ మార్కులు సాధించిన ఆమెకు ప్రతిష్ఠాత్మక ప్రొఫెసర్ బీర్ బహదూర్ గోల్డ్ మెడల్ లభించింది.
హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో శనివారం నవంబర్ 28న నిర్వహించిన 24వ స్నాతకోత్సవంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా చేతుల మీదుగా కాలజ్ఞ బంగారు పతకంతో పాటు…






