భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ డివిజన్ రైతు ఆత్మ చైర్మన్ జంగపెల్లి ఐలయ్య కోరారు. అర్హులైన ప్రతి ఒక్కరూ పథకానికి సంబంధించిన వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో…