భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, చేపట్టిన అమరణ నిరాహార దీక్ష ఉద్యమ చరిత్రలో కీలక ఘట్టాలని హుస్నాబాద్ BRS నాయకులు తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి చాటేందుకు ఈ నెల 29న అల్గునూర్లో నిర్వహించనున్న దీక్షా దివస్ భారీ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని BRS పార్టీ కార్యాలయంలో గురువారం దీక్షా దివస్ సందర్భంగా…






