భారత్ సమాచార్, సిద్దిపేట జిల్లా: నక్సల్స్ దాడిలో తీవ్రంగా గాయపడి 33 ఏళ్లుగా మంచానికే పరిమితమైన ఓ మాజీ సర్పంచ్ తన కుటుంబాన్ని ఆదుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను వేడుకున్నారు. తన కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించడంతోపాటు, జీవితాంతం అవసరమైన మందులను ఉచితంగా అందించేలా సహాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. బాధితుడి పరిస్థితిని గమనించిన బండి సంజయ్ స్వయంగా కార్యాలయం నుంచి బయటకు వచ్చి ఆయనను పరామర్శించారు.

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం నందారం గ్రామానికి చెందిన…