భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌లో ఓటర్లు ఉత్సాహాన్ని కనబరిచారు. ఆరు మండలాల్లో కలిపి రికార్డు స్థాయిలో 88.46 శాతం భారీ పోలింగ్ నమోదైంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వివరాలు వెల్లడించారు.

మొత్తం 1,63,148 ఓట్లకు గాను, 1,44,323 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పాపన్నపేట, టేక్మాల్, హవేలి ఘనపూర్, పెద్ద శంకరంపేట, రేగోడు, అల్లాదుర్గ్ రూరల్ మండలాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మండలాల వారీగా చూస్తే, రేగోడు రూరల్…