భారత్ సమాచార్, మెదక్ జిల్లా: జిన్నారం సర్వే నంబర్ 1 రైతు బాధితుల సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయి. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ రైతులకు అండగా నిలబడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కాటా శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు నాయకులు జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహను కలిసి రైతుల సమస్యను తెలియజేశారు. దీనిపై స్పందించిన మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్‌కు, ఆర్డీవోకు, ఎమ్మార్వోకు సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు.…