భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకొని నర్సాపూర్ పురపాలక సంఘం ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు 49 నామినేషన్లు స్వీకరించినట్లు మున్సిపల్ కమిషన్ శ్రీరామ్ చరణ్ రెడ్డి తెలిపారు. బీజేపీ నుంచి 15, బీఆర్ఎస్ నుంచి 11, కాంగ్రెస్ నుంచి 13, సీపీఎం నుంచి 01, ఇతర పార్టీల 2, ఇండిపెండెంట్ అభ్యర్థులు 7 నామినేషన్లు దాఖలు చేశారు. నిన్నతో కలిపి మొత్తం 52 నామినేషన్లు దాఖలు వచ్చినట్లు పేర్కొన్నారు.