భారత్ సమాచార్, మెదక్ జిల్లా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ప్రతి ఒక్కరూ గౌరవిస్తూ, మన ఆచార వ్యవహారాలను కాపాడుకోవాలని ABVP మెదక్ జిల్లా కన్వీనర్ బండారి ప్రశాంత్ పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) రామాయంపేట శాఖ ఆధ్వర్యంలో స్థానిక సాయికృపా కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.
పూలతో బతుకమ్మలు.. పాటలతో సందడి
కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులు వివిధ రకాల రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్న…






