భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా :
మహబూబాబాద్ పట్టణంలోని శనిగపురం 9వ వార్డులో నిర్వహించబడుతున్న ఆదర్శ్ వెల్ఫేర్ & ఎడ్యుకేషనల్ సొసైటీ వృద్ధాప్య ఆశ్రమం సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. సుమారు 13 నెలల క్రితం ప్రారంభమైన ఈ ఆశ్రమంలో ప్రస్తుతం 11 మంది నిరాశ్రయ వృద్ధ మహిళలకు ఆశ్రయం, ఆహారం, అవసరమైన సంరక్షణను అందిస్తున్నారు. కుటుంబ సభ్యులు లేని లేదా ఆదరించే వారు లేని వృద్ధులకు ఈ ఆశ్రమం భరోసాగా మారింది.
ఆశ్రమ నిర్వాహకుల వివరాల ప్రకారం, కుటుంబ సభ్యుల…





