భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఆదివాసి బిడ్డ శిరీష కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమెకు జరిగిన ఘటనకు బాధ్యుడైన నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ గిరిజన సామాజిక చైతన్య వేదిక, DSFI ఆధ్వర్యంలో మహబూబాబాద్‌లోని కొమరం భీమ్ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శిరీష కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచి, బాధిత కుటుంబానికి తగిన న్యాయం చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
శిరీష కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, ఘటనకు బాధ్యుడైన నిందితుడిపై చట్టపరంగా కఠిన…





