భారత్ సమాచార్.నెట్, నిర్మల్: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 27న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న బంద్‌కు భైంసా ఆగ్రో డీలర్స్ అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా భైంసా డివిజన్ వ్యాప్తంగా విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు. శనివారం భైంసా వ్యవసాయ అధికారి గణేష్‌ను కలిసి తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు సిరం సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎరువుల కంపెనీలు అనుసరిస్తున్న మొండి వైఖరిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.…





