భారత్ సమాచార్.నెట్, నల్లగొండ జిల్లా: త్రిపురారం మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా త్రిపురారం గ్రామానికి చెందిన ప్రముఖ నాయకుడు ఆలెంపల్లి జానయ్య నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆయన నియామక పత్రాన్ని అధికారికంగా విడుదల చేశారు. త్రిపురారం మండల కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే తొలిసారిగా ఒక మాదిగ సామాజికవర్గానికి చెందిన నాయకుడు మండల అధ్యక్షుడిగా ఎన్నిక కావడం గమనార్హం. పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ ఎస్సీ సామాజికవర్గ అభ్యున్నతికి, కాంగ్రెస్…