భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: తూప్రాన్ పట్టణంలోని సాయిట్రస్ట్ భవన్‌లో ఈ నెల 26 నుంచి 29 వరకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో ‘ఆనంద కార్యక్రమం’ నిర్వహించనున్నారు. శ్రీనివాస్ గురూజీ పర్యవేక్షణలో జరిగే ఈ నాలుగు రోజుల కోర్సులో యోగా, ప్రాణాయామం, ధ్యానం, శక్తివంతమైన ‘సుదర్శన క్రియ’ నేర్పించనున్నారు. 18 ఏళ్లు పైబడిన వారు ఈ శిక్షణలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు.
ఈ కోర్సు ద్వారా ఒత్తిడి తగ్గడం, రోగనిరోధక శక్తి పెరగడం, ఉత్సాహం, సానుకూల దృక్పథం పెంపొందుతాయని వారు పేర్కొన్నారు.…





