భారత్ సమాచార్.నెట్, మెదక్: జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కోసం చేపట్టిన “ఆపరేషన్ స్మైల్” విజయవంతంగా కొనసాగుతోందని అదనపు ఎస్పీ మహేందర్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ 20 రోజుల్లో 41 కేసులు నమోదు చేసి, 49 మంది బాలలను రక్షించినట్లు పేర్కొన్నారు. 12 మంది పిల్లలను సంరక్షణ కేంద్రాలకు తరలించామని, నలుగురు బాలలను తిరిగి పాఠశాలల్లో చేర్పించామని వెల్లడించారు.

పిల్లల చేతిలో పనిముట్లు కాదు, పుస్తకాలు ఉండాలని.. బాల్యం బడిలోనే గడవాలని…