భారత్ సమాచార్.నెట్, మెదక్ జిల్లా: ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం ద్వారానే సమాజాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దగలమని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పేర్కొన్నారు. ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘రెడ్ రన్’ వాకథాన్‌ను ఆమె గురువారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ జిల్లా ఆసుపత్రి నుంచి రాందాస్ చౌరస్తా వరకు కొనసాగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అసురక్షిత సంబంధాలు, కలుషిత రక్తం ద్వారా వ్యాపించే ఈ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు.…