భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రామాయంపేట పట్టణ కేంద్రంలో ఇటీవల మోడల్ స్కూల్ విద్యార్థులతో వెళ్తున్న ఆటో ప్రమాదానికి గురికావడం తీవ్ర విషాదకరమని భారతీయ జనతా పార్టీ పేర్కొంది. ఈ ఘటన విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు స్థానిక ప్రజలను ఆందోళనకు గురి చేసిందని తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా రహదారి భద్రతపై శాశ్వత చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేసింది.
బీజేపీ నాయకులు మాట్లాడుతూ రామాయంపేట బైపాస్‌లోని ప్రమాదకరమైన వై జంక్షన్ వద్ద గతంలో కూడా సుమారు 30 మంది…





