భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం నెల్లికుదురు మండలంలోని వెంకటాపురం, నైనాల గ్రామాల్లో నిర్వహించిన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని, అందువల్ల రాష్ట్రంలో బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడుతోందని పేర్కొన్నారు.లు, కార్యకర్తలు…