భారత్ సమాచార్.నెట్: ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు ప్రజల జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోని భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ క్రమంలోనే చార్‌ధామ్ యాత్రకు బ్రేక్ పడింది. చార్‌ధామ్ యాత్రను మరో 24 గంటలు వాయిదా వేశారు.
భారీ వర్షాల హెచ్చరికలు ఉన్నందున యాత్రికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. యాత్రికులను హరిద్వార్, రిషికేశ్, శ్రీనగర్, రుద్రప్రయాగ్, సోన్‌ప్రయాగ్,…




