భారత్ సమాచార్ నెట్, మహబూబాబాద్ : నెల్లికుదురు మండలం పార్వతమ్మ గూడెం ప్రాథమికోన్నత పాఠశాలలో వినూత్న కార్యక్రమం చోటుచేసుకుంది. పాఠశాల విద్యార్థుల సృజనాత్మకతను, వారి పాఠశాల కార్యకలాపాలను ప్రతిబింబించేలా హెచ్ఎం నరేంద్ర కుమార్ రూపొందించిన క్యాలెండర్లను సర్పంచులు ఎదల్ల పూలమ్మ, పులి వెంకన్న శుక్రవారం విద్యార్థులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ.. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధనతో పాటు, విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహిస్తూ ఇలా క్యాలెండర్లపై వారి చిత్రాలను ముద్రించడం అభినందనీయమన్నారు. హెచ్ఎం నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన…





