భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: నెల్లికుదురు మండలం మదన్నతుర్తి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బర్లను మేపుతూ, ఎండ తీవ్రత తట్టుకోలేక పొలంలో ఆగి ఉన్న ట్రాక్టర్ కింద విశ్రాంతి తీసుకుంటున్న బేతమల్ల ఉప్పలయ్య(54) అనే వ్యక్తిపై నుండి ట్రాక్టర్ వెళ్లడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ సురేష్ అజాగ్రత్తగా, కింద మనిషి ఉన్నాడనే విషయాన్ని గమనించకుండా వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమని ఎస్సై రమేష్ బాబు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఉప్పలయ్య పక్కటెముకలు విరిగి, రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులు ఆయనను మానుకోటలోని…





