భారత్ సమాచార్ నెట్, నిజామాబాద్ : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు పేకాట స్థావరంపై సీసీఎస్ (CCS) పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు. ఏసీపీ ఇన్‌చార్జ్ మస్తాన్ వాలి నేతృత్వంలో ఎస్సైలు గోవింద్, మహేష్, సిబ్బంది నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్జాపూర్ అటవీ ప్రాంతంలో అక్రమంగా కొనసాగుతున్న పేకాట స్థావరంపై దాడి చేశారు.
ఈ దాడిలో 12 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 31,410 నగదుతో పాటు 10 సెల్‌ఫోన్లను స్వాధీనం…





