భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మాజీ మంత్రి, సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావును మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణానికి చెందిన మాజీ జడ్పిటిసి చౌటి మాధవి జగదీశ్వర్ ఆదివారం హైదరాబాద్ నగరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీష్ రావు నర్సాపూర్ పట్టణంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఆరా తీశారు. నర్సాపూర్ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం కోసం కృషి చేయాలని సూచించినట్లు జగదీశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అభిరామ్, వినయ్ తదితరులు ఉన్నారు.
హరీష్ రావును కలిసిన చౌటి మాధవి జగదీశ్వర్





