భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మనోహరాబాద్ మండలం కాళ్ళకల్ గ్రామంలో ది జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీల్లో భాగంగా క్రీడా పోటీలను బుధవారం కాళ్ళకల్ గ్రామ సర్పంచ్ నవ్య నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ యువత క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాళ్ళకల్ గ్రామ సర్పంచ్ నవ్యనాగరాజు గౌడ్, ఉప సర్పంచ్ వీ.ప్రవీణ్,…