భార‌త్ స‌మాచార్.నెట్, మెదక్: సీఎం స‌హాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాల‌క్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆమె చిలాప్ చెడ్ మండలంలోని గౌతాపూర్, రత్న తండాకు చెందిన సామ్య రత్లాకు రూ.18వేలు, ఎండ్ల లక్ష్మికి రూ.12వేలు మంజూరైన చెక్కులను హైదరాబాద్ లోని తన నివాసంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక గొప్ప సహాయం చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన…