భారత్ సమాచార్.నెట్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచీ పరిశ్రమలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. అయితే ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది ఆచూకీ తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు. ప్రమాద సమయంలో 143 మంది కార్మికులు ఉన్నారని తెలిపారు. అయితే ఈ ఘటనపై విచారణకు నిపుణులతో కమిటీ వేశామని.. ఆ కమిటీ నివేదిక…