భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న స్నేక్ రెస్క్యూ స్పెషలిస్ట్ ఇ.సంతోష్ బాబు కుమార్తె వైరా లోని ప్రభుత్వ ఆశ్రమ కళాశాలలో చదువుతూ గత మార్చి లో బైపిసి ప్రధమ సంవత్సరం 440 కి 436 సాధించింది. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సుజాత సోమవారం కార్యాలయంలో సాత్వికను శాలువాతో సత్కరించి అభినందించారు. కమిషనర్ సుజాత ఈ సందర్భంగా సాత్వికకు అనేక సలహాలు సూచనలు చేశారు.వైద్య విద్య కోసం అన్ని మార్గాలను సద్వినియోగం చేసుకోవాలని, లోతైన అధ్యయనం చేయాలని…