భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: శాంతిభద్రతల పరిరక్షణకే కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహిస్తున్నామని ముథోల్ సీఐ రవీందర్ నాయక్ అన్నారు.సోమవారం తానూర్ మండల కేంద్రంలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.ఇందులో భాగంగా సరైన ధ్రువ పత్రాలు లేని 60 బైకులు,5 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు.సైబర్ నేరాలు,రోడ్డు భద్రత తదితర వాటి గురించి ముథోల్ సీఐ రవీంద్ర నాయక్ స్థానిక ప్రజలకు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క వాహనదారుడు సరైన ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించరాదని సూచించారు.ఏదైనా సమాచారం ఉంటే…