భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మొక్కజొన్న కొనుగోలు కేంద్రంలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మండల కేంద్రం ఇనుగుర్తిలో రైతులతో కలిసి సిపిఎం నాయకులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మార్తినేని పాపారావు, మండల కార్యదర్శి గొడిశాల వెంకన్నతో కలిసి మాట్లాడుతూ… 10రోజులుగా రైతులకు ఖాళీ బస్తాలు ఇవ్వకుండా, మొక్కజొన్న బస్తాలు కాంటాలు నిర్వహించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ కరుణాకర్ ఘటనా స్థలానికి వెళ్లి సమస్య తీవ్రతను తహసిల్దార్ కు…