భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: బిచ్కుంద మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని కాంగ్రెస్ యువ నాయకుడు ముజాహిద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 7వ వార్డు పరిధిలోని ప్రజలకు స్థానికంగా ఉంటూ గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టానని, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు సంబంధించిన వాటిపై దగ్గరుండి సమస్యలు పరిష్కరించడం, పెన్షన్లు, ఇంటింటికి తిరిగి మొక్కల పంపిణీ, మంచినీటి సమస్య ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే పరిష్కారం, పచ్చదనం…