భారత్ సమాచార్.నెట్, మెదక్: నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి సహకారంతో కౌడిపల్లి మండల కేంద్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కౌడిపల్లికి చెందిన నల్లపల్లి భావ్య శ్రీకి రూ.27వేలు, మ్యదరి దుర్గయ్యకు రూ.15వేలు విలువైన చెక్కులను అందించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సీడీసీ మాజీ చైర్మన్ చిలుముల దుర్గారెడ్డి, యువ నాయకులు పోల నవీన్, యూత్ అధ్యక్షులు నందీప్ కుమార్, సంగప్పలు పాల్గొన్నారు.