భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : నరసింహుల గూడెంలో తక్షణమే గ్రంథాలయం ఏర్పాటు చేయాలని రిటైర్డ్ టీచర్, ప్రకృతి సంరక్షణ సేవా సమితి అధ్యక్షుడు బండారి ఉప్పలయ్య డిమాండ్ చేశారు. గ్రామస్తుల విజ్ఞానం కోసం నాలుగేళ్ల క్రితమే సుమారు 300 పుస్తకాలతో సొంత ఖర్చులతో పంచాయతీ కార్యాలయంలో గ్రంథాలయాన్ని ప్రారంభించామని తెలిపారు. అయితే, కార్యాలయంలో స్థలాల ఇబ్బంది వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

 

గ్రంథాలయం కోసం ప్రత్యేక భవనం నిర్మించి, ఉద్యోగిని కేటాయించాలని ఇప్పటికే కలెక్టర్, ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్‌కు విన్నవించినట్లు ఆయన తెలిపారు.…