భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో కుటుంబ కలహాల నేపథ్యంలో పురుగుల మందు సేవించిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నెల్లికుదురు ఎస్ఐ చిర్ర రమేష్ బాబు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన సిద్దబోయిన నవీన్ (30) డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి జీవనం సాగించేవాడు. కుటుంబ వ్యవహారాల విషయంలో భార్యతో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ ఘటన…





