భారత్ సమాచార్.నెట్, మెదక్: నర్సాపూర్ పట్టణంలో ‘నషా ముక్త్ భారత్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం భారీ అవగాహన కార్యక్రమం జరిగింది. కమిషనర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆదేశాల మేరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్, విద్యార్థులతో డ్రగ్ వ్యతిరేక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు, సిబ్బంది నర్సాపూర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి, అక్కడ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సీఐ గులా ముస్తఫా, డీటీఎఫ్ సీఐ గోపాల్, ఎక్సైజ్ ఎస్సై బాలయ్య, అరుణ, ఖాజా అజీస్…