భారత్ సమాచార్.నెట్: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికలకు సంబంధించి సేకరించిన సీసీటీవీ కెమెరాలు, వెబ్‌కాస్టింగ్, వీడియో ఫుటేజ్ లాంటి ఎలక్ట్రానిక్ డేటాను.. ఎన్నికలు ముగిసిన 45 రోజుల తర్వాత తొలగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. తమ వద్ద ఉన్న ఎలక్ట్రానిక్ డేటాను కొంతమంది దుర్వినియోగం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డేటాను తొలగించాలని ఈ నిర్ణయం…