భారత్ సమాచార్, యాదాద్రిభువనగిరి జిల్లా: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆలయ ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవ మూర్తులను వివిధ పట్టువస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. సుగంధ పరిమళ పుష్పాలతో లక్ష పుష్పార్చన చేపట్టారు. పాంచరాత్రాగమానుసారంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు, అధికారులు పాల్గొన్నారు.






