భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని మాచారం సమీపంలో నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. హైదరాబాద్ దిశగా వెళ్తున్న జగన్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు రోడ్డు మీద ముందుగా వెళ్తున్న కెమికల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ ట్యాంకర్‌లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ రసాయనం ఉండడంతో ఢీ కొనగానే భారీగా పొగలు ఎగసిపడ్డాయి. ఆకస్మికంగా పొగలు రావడంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. డ్రైవర్ సూచనతో వారు ఎమర్జెన్సీ డోర్ ద్వారా కిందకు దూకి బయటపడ్డారు.
సమీపంలోని స్థానికులు…





