భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి జడ్పీహెచ్ఎస్‌లో విద్యాభ్యాసం చేసిన 1988-89 టెన్త్ బ్యాచ్ పూర్వ విద్యార్థులు తన క్లాస్మెంటు తూల్ల జంపయ్య అనారోగ్యంతో ఉండడాన్ని చూసి ఆర్థిక సహాయం అందించారు. తాము చదువుకున్న ఇనుగుర్తి హైస్కూల్‌లో ఉపాధ్యాయుల సమక్షంలో శుక్రవారం రూ.15,216 నగదును జంపయ్యకు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఇంఛార్జ్ హెచ్‌ఎం ప్రవీణ్ మాట్లాడుతూ.. మూడు దశాబ్దాల క్రితం చదువుకున్న పూర్వ విద్యార్థులు తమ స్నేహితుడు అనారోగ్యం బారిన పడ్డాడని ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. దీనిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.…
ఆర్థికసాయం అందజేసిన తోటి స్నేహితులు





