భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: అనాథగా చివరి ప్రయాణం కూడా ఒంటరిగా అయ్యే పరిస్థితిలో ఉన్న వ్యక్తికి MDR ఫౌండేషన్ ప్రెసిడెంట్ మధు తనే కుటుంబ సభ్యుడిలా మారి గౌరవప్రదంగా అంత్యక్రియలు నిర్వహించారు.  పటాన్‌చెరు మండలంలోని ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని చనిపోయిన అతనికి సంబంధించిన వారు ఎవరు రాకపోవడంతో ఆస్పత్రి నుంచి స్వయంగా తీసుకెళ్లి సంప్రదాయ బద్దమైన కర్మకాండలు చేసి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంత్యక్రియలకు మాదిరి ప్రిథ్వీరాజ్ ఆర్థిక సహకారం అందించారు. సమాజంలో తమ…