భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్: నెల్లికుదురు మండలం నర్సింహులగూడెంలోని శ్రీ కోరగుట్ట లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు కన్నులపండువగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారి గిరి చుట్టూ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ‘బండ్లు ప్రదక్షిణ’ కార్యక్రమం ఘనంగా జరిగింది.

భక్తులు తమ ఎడ్లబండ్లతో పాటు ద్విచక్ర, త్రిచక్ర, చతుశ్చక్ర వాహనాలను పూలతో అందంగా అలంకరించుకుని, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి గిరి ప్రదక్షిణ చేశారు. శనివారం ప్రారంభమైన ఈ ఉత్సవాలు సోమవారం నాటి బండ్లు ప్రదక్షిణ, ప్రసాద వితరణతో పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల చివరి రోజు కావడంతో…